బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్రలోనైనా సహజమైన నటనతో ఆకట్టుకుంటారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను లియోనార్డో డికాప్రియో నటించిన హాలీవుడ్ చిత్రం ‘బాడీ ఆఫ్ లైస్’ను (2008) ఎందుకు తిరస్కరించానో వివరించారు నానా పటేకర్. ఆయన మాట్లాడుతూ ‘అమెరికల్ స్పై థ్రిల్లర్ కథాంశమది.
మిడిల్ ఈస్ట్‌లో షూటింగ్ చేశారు. ఆ సినిమాలో తీవ్రవాది పాత్ర చేయమని నాకు ఆఫర్ ఇచ్చారు. హాలీవుడ్ సినిమా కాబట్టి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారు. ఓ తీవ్రవాది క్యారెక్టర్లో అభిమానులు నన్ను చూడలేరనే ఉద్ధేశ్యంతో ఆ సినిమా వదులుకున్నా’ అన్నారు. హాలీవుడ్లో ‘ది పూల్’ అనే ఓ చిత్రంలో నటించానని, ఆ తర్వాత అక్కడి నుంచి చాలా ఆఫర్లొచ్చినా ఇంగ్లీష్ భాష మీద పూర్తి పట్టులేకపోవడంతో చేయలేకపోయానని నానా పటేకర్ తెలిపారు.