JNTUH VC | మహిళలు దేనికి పనికిరారు.. ‘మీరు పిల్లలు కనడానికే సరిపోతరు!.. జేఎన్టీయూహెచ్ వీసీ కిరణ్‌కుమార్‌రెడ్డి
మీరు చెత్తబుట్టతో సమానం.. ఇంటికే పరిమితమైతే మంచిది.. మహిళా అధ్యాపకులపై జేఎన్టీయూహెచ్ వీసీ దుర్భాష.
- సదస్సుకు ఆహ్వానించడానికి వెళ్లిన వారిపై ఆగ్రహం
- సుత్తితో వారిపై దాడికి యత్నించిన కిరణ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో/కేపీహెచ్‌బీ కాలనీ, అక్టోబర్ 7(నమస్తే తెలంగాణ): ఆహ్వానించడానికి వెళ్లిన తమపై జేఎన్టీయూహెచ్ వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ టీ కిరణ్‌కుమార్‌రెడ్డి దుర్భాషలాడుతూ దాడికి యత్నించారని పేర్కొంటూ విద్యాజ్యోతి ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీరు పిల్లల్ని కనడానికి మాత్రమే పనికొస్తారంటూ తమపై లింగద్వేష వ్యాఖ్యలతో అవమానించారని వారు ఆరోపించారు. ఈ మేరకు వీసీ కిరణ్‌కుమార్‌రెడ్డిపై వీజేఐటీ ప్రిన్సిపాల్ ఏ సృజన కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి..
జేఎన్టీయూహెచ్ వర్సిటీ అనుబంధ కళాశాల విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వీజేఐటీ) ప్రిన్సిపాల్ ఏ సృజన, కళాశాల సీఎస్ఈ విభాగాధిపతి డీ అరుణకుమారి ముందస్తుగా తీసుకున్న అనుమతితో ఈ నెల 6న కూకట్‌పల్లిలోని జేఎన్టీయూహెచ్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ టీ కిరణ్‌కుమార్‌రెడ్డిని కలువడానికి వెళ్లారు. కళాశాలలో ఈ నెల 30న నిర్వహించనున్న ఏడబ్ల్యూస్ స్టూడెంట్ కమ్యూనికేషన్ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరు కావాలని వారు ఆహ్వాన పత్రిక అందచేశారు. దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన వీసీ.. వారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను ఆహ్వానించే అర్హత మహిళలైన మీకు లేదని ఆగ్రహం వ్యక్తంచేసినట్టు బాధిత అధ్యాపకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
మహిళలు దేనికీ పనికిరారని, వారు ఇంటికే పరిమితమై, వంటగది చూసుకోవడం, పిల్లల్ని కనడం చేయాలని వీసీ వ్యాఖ్యలు చేశారని.. చెత్తబుట్టను చూపిస్తూ మీరు చెత్తకంటే హీనమైనవారని అవమానించారని బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము అభ్యంతరం తెలిపే ప్రయత్నంచేస్తే, గెట్ఔట్ అంటూ అరిచాడని తెలిపారు. అంతటితో ఆగకుండా తన టేబుల్‌పై ఉన్న సుత్తితో దాడి చేసేందుకు యత్నించాడని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనురాగ్ యూనివర్శిటీ సీఈవో నీలిమను కూడా రాయలేని భాషలో దూషించినట్లు బాధితులు ఫిర్యాదులో తెలిపారు. మా ఎదుట మీరు కనీసం కూర్చోడానికి కూడా అర్హులు కాదని అవమానపర్చాడని బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
‘పల్లా నీ సంగతి చూస్తా!’
వీజేఐటీ యాజమాన్యం తనను అవమానించిందని, దానికి ప్రతిగా విద్యాసంస్థ కార్యదర్శి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సంగతి చూస్తానంటూ వీసీ కిరణ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారని బాధిత మహిళలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ యేడాది ఉద్దేశపూర్వకంగానే తాను వీజేఐటీ కళాశాల సీట్లను, ఫీజును తగ్గించానని వీసీ తమతో చెప్పారని వారు తెలిపారు. తమను దుర్భాషలాడి, దాడికి యత్నించిన వైస్‌చాన్సలర్‌పై చర్యలు తీసుకోవాలని వీజేటీ ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సృజన ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని, వర్సిటీలో విచారించి కేసు నమోదు చేస్తామని సీఐ నమస్తే తెలంగాణకు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఫామ్ 6, 7, 8లను మార్చలేరు.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ
Musi Project | మూసీ ముసుగులో లూటీ.. గుట్టుగా ప్రజాభిప్రాయ సేకరణ .. ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ ఆగ్రహం
T20I | విజయంతో ముగించారు.. జింబాబ్వేతో వన్డే సిరీస్‌నూ క్లీన్‌స్వీప్ చేసిన భారత్
Voter Registration | ఓటు నమోదులో గ్రాడ్యులేట్..! మందకొడిగా ఓటర్ల నమోదు
CPI | తెలంగాణను కరువు రాష్ట్రంగా ప్రకటించండి.. సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కూనంనేని
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

