ఆర్టీఓ కార్యాలయాల వారీగా డ్రైవ్ నిర్వహించి లైసెన్స్‌ల పరిశీలన చేస్తున్నారు. ప్రస్తుత అడ్రస్ లేకపోతే లైసెన్స్ పునరుద్ధరణ సమయంలో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచించారు. ఆన్లైన్లోనే అడ్రస్ మార్చుకోవచ్చని వివరించారు.
కేంద్ర ప్రభుత్వ పోర్టల్ వాహన్‌లో దరఖాస్తుదారులు చెల్లుబాటు అయ్యే చిరునామా రుజువును సమర్పించాల్సి ఉంటుంది. వాహన్ పోర్టల్ parivahan.gov.in ని సందర్శించి వివరాలు నమోదు చేయాలి. ప్రస్తుత చిరునామాను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్లాట్ బుక్ చేసుకొని పత్రాల ధృవీకరణ కోసం ఆర్టీఓ కార్యాలయం వెళ్లాలి. 2-3 రోజుల్లో అప్డేటెడ్ లైసెన్స్ ఇంటి చిరునామాకు చేరుకుంటుందని అధికారులు పేర్కొన్నారు.