Bollywood Actor Satish Shah | బాలీవుడ్లో విషాదం నెలకొంది. ప్రముఖ బాలీవుడ్ హాస్యనటుడు సతీష్ షా కన్నుమూశారు. కొద్దిరోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన 74 ఏళ్ల వయసులో శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సినీ నిర్మాత అశోక్ పండిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇక సతీష్ షా మరణవార్త తెలుసుకున్న బాలీవుడ్ సినీ ప్రముఖలు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా సినీ, టీవీ పరిశ్రమల్లో సేవలందించిన సతీష్ షా ‘సారభాయ్ వర్సెస్ సారభాయ్’ అనే
టీవి షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘సారభాయ్ వర్సెస్ సారభాయ్’ లో ఇంద్రవదన్ శరభాయ్గా ఆయన పోషించిన పాత్ర ఇండియన్ టీవీ చరిత్రలోనే అత్యంత ఐకానిక్ హాస్య పాత్రలలో ఒకటిగా నిలిచింది. ఇదేకాకుండా మై హూ నా’, ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’, ‘కల్ హో నా హో’ వంటి హిట్ సినిమాలలో కామెడియన్గా రాణించాడు.