సీనియర్ నటుడు అజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘చక్రవ్యూహం’. ‘దిట్రాప్ అనేది’ ఉపశీర్షిక. చెట్కూరి మధుసూధన్ దర్శకుడు. సావిత్రి నిర్మాత. జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. విజువల్స్, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. తప్పకుండా చిత్రం అందరి ఆదరణ పొందతుందనే నమ్మకం ఉంది’ అన్నారు.