Sharwanand | శర్వానంద్ హీరోగా ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఆద్యంతం హాస్యప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కేరళలో పదిరోజుల పాటు జరిగిన షెడ్యూల్లో కీలక సన్నివేశాల తెరకెక్కించారు.
‘నాయకానాయికలు శర్వానంద్, సాక్షి వైద్యలపై ఓ పాటను చిత్రీకరించాం. అలాగే ఓ ఫైట్ సీక్వెన్స్‌ను కూడా తెరకెక్కించాం. ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే లక్ష్యంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను త్వరలో విడుదల చేస్తాం’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కథ: భాను భోగవరపు, నిర్మాతలు: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్ అబ్బరాజు.