నీది నాది ఒకే కథ ఫేం డైరెక్టర్ వేణు ఊడుగుల (Venu Udugula) దర్శకత్వం వహిస్తున్న చిత్రం విరాటపర్వం (Virataparvam). రానా (Rana Daggubati), సాయిపల్లవి (Sai Pallavi) కాంబోలో వస్తున్న ఈ చిత్రం జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటకు మంచి స్పందన వస్తోంది. తాజాగా మరో సాంగ్ అప్ డేట్‌ను సరికొత్తగా ప్రకటించారు మేకర్స్.
నేటి విరాటపర్వం వార్తలులోని ముఖ్యాంశం..విరాటపర్వం చిత్రంలోని ‘నగాదారిలో ‘ పాటను జూన్ 2వ తేదీన విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సాంగ్ రిలీజ్‌తో చిత్ర ప్రచార కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్టు తెలుపుతూ..మ్యూజిక్ సురేశ్ బొబ్బిలి కామెంట్స్ తో కూడిన వీడియోను డైరెక్టర్ వేణు ఊడుగుల ట్వీట్ చేశాడు. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
పీరియాడిక్ డ్రామా బ్యాక్ డ్రాప్లో రాబోతున్న విరాటపర్వంలో నివేదా పేతురాజ్, ప్రియమణి, నవీన్‌చంద్ర, సాయిచంద్, జరీనా వహబ్, ఈశ్వరీరావు, నందితా దాస్ కీ రోల్స్ చేస్తున్నారు. సురేశ్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సురేశ్ బొబ్బిలి మ్యూజిక్ డైరెక్టర్.
నేటి #విరాటపర్వంవార్తలు లోని ముఖ్యాంశం…
విరాటపర్వం చిత్రంలోని 'నగాదారిలో ' పాటని, JUNE 2వ తారీఖున విడుదల చేస్తూ…చిత్ర ప్రచార కార్యక్రమాలను ప్రారంభిస్తున్న బృందం.#Nagaadaarilo Song From #VirataParvam on JUNE 2nd 💥💥#VirataParvamOnJune17th pic.twitter.com/3sCVFDnzg4
— v e n u u d u g u l a (@venuudugulafilm) May 31, 2022