Venu Udugula | వేణు ఊడుగులకు డైరెక్టర్‌గా సూపర్ బ్రేక్.. నీది నాది ఒకే కథకు ఆరేండ్లు
Venu Udugula | వేణు ఊడుగుల (Venu Udugula) తొలిసారి మెగాఫోన్ పట్టి డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన చిత్రం నీది నాది ఒకే కథ (Needi Naadi Oke Katha). సామాజిక సమస్య నేపథ్యంలో తెరకెక్కిన శ్రీవిష్ణు కెరీర్లో వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచింది.
Venu Udugula | టాలీవుడ్లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్ల జాబితాలో ఒకరు వేణు ఊడుగుల (Venu Udugula). తొలిసారి మెగాఫోన్ పట్టి డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన చిత్రం నీది నాది ఒకే కథ (Needi Naadi Oke Katha). సామాజిక సమస్య నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా నటించగా.. సత్నా టైటస్ హీరోయిన్గా నటించింది. రూ.2.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.12 కోట్లకు పైగా వసూళ్లు చేసి శ్రీవిష్ణు కెరీర్లో వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచింది.
ఈ చిత్రం విజయవంతంగా ఆరేండ్లు పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. నా మొదటి సినిమా విడుదలై ఆరేళ్లు అవుతోంది. నేను శ్రీవిష్ణు, కృష్ణ విజయ్, ప్రశాంతి ముళ్లపూడి, నారా రోహిత్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నా.
ఈ సినిమాకి పనిచేసిన సాంకేతిక నిపుణులతోపాటు ఈ ప్రయాణంలో నాకు సహకరించిన నా కుటుంబ సభ్యులు, స్నేహితులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.. అని ట్వీట్ చేశాడు వేణు ఊడుగుల.
కర్నూల్లో మధ్యతరగతి కుటుంబానికి చెందిన రుద్రరాజు సాగర్ డిగ్రీ ఫెయిలవుతూనే ఉంటాడు. తన కొడుకు ప్రతీసారి ఇలా ఫెయిలవడం టీచర్ అయిన తండ్రి దేవీ ప్రసాద్‌కు నచ్చదు. ఈ క్రమంలో సాగర్‌కు సత్నా టైటస్ పరిచయమవుతుంది. ఆ తర్వాత శ్రీవిష్ణులో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు పుస్తకాలు చదివించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఎంత ప్రయత్నించినా తనకు మాతర్ చదువు సెట్ అవడం లేదని, నచ్చిన పని చేసుకుంటూ బతికేందుకు తాను ఎక్కువ ఇష్టపడుతున్నానని తండ్రిని ఒప్పించే ప్రయత్నం చేస్తుంటాడు శ్రీవిష్ణు.
చివరగా హీరోహీరోయిన్లు ప్రేమలో పడటం.. హీరో తనకు నచ్చిన ఉద్యోగం (క్యాబ్ డ్రైవర్) చేస్తూ తండ్రిని ఒప్పిస్తాడు. తండ్రి చెప్పినట్టుగా చదువును కొనసాగించలేక, తనకు నచ్చిన పనిని చేయలేక ఇబ్బంది పడే యువకుడి కథను సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించిన తీరుకు ప్రేక్షకులు ఇంప్రెస్ అయ్యారు.
It has been six years since the release of my first film. I want to express my heartfelt thanks to @sreevishnuoffl, Krishna Vijay, Prashanthi Mullapudi, and @IamRohithNara sir for believing in me and giving me the opportunity to direct. I am eternally indebted to the technicians… pic.twitter.com/CdH5v8jS9W
— v e n u u d u g u l a (@venuudugulafilm) March 23, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

