Vennela Kishore | సమాజంలో ప్రస్తుతం ఉన్న ఓ సమస్యను వినోదాత్మకంగా చూపిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్నారు. సంజీవ్‌రెడ్డి దర్శకుడు. మధుర శ్రీధర్‌రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌రెడ్డి నిర్మాతలు. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న వెన్నెల కిశోర్ ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు.
ఇందులో ఆయన డాక్టర్ భ్రమరంగా కనిపిస్తారని, గర్భగుడి వెల్నెస్ సెంటర్ నిర్వహించే డాక్టర్ భ్రమరం.. తన దగ్గరకు సంతాన లేమి సమస్యలతో వచ్చే వారికి ఆయుర్వేద వైద్యాన్ని మోడరన్ మందులతో కలిపి ఎలా ట్రీట్ చేశారు అనేది హిలేరియస్‌గా ఉంటుందని, తన డైలాగ్ టైమింగ్‌తో వెన్నెల కిశోర్ పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తారని మేకర్స్ చెబుతున్నారు. తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్ తదితరులు ఇతర తారాగణం.