ప్రస్తుతం టాలీవుడ్ టాప్ కమెడియన్ ఎవరంటే టక్కున వచ్చే సమాధానం వెన్నెల కిశోర్. వల్గారిటీకి దూరంగా హెల్దీ కామెడీతో.. అద్భుతమైన టైమింగ్‌తో ఆడియన్స్‌ని అలరిస్తుంటారాయన. ఇప్పుడు టాలీవుడ్లో వెన్నెల కిశోర్ టైమ్ నడుస్తున్నది.
దర్శకనిర్మాతలకు ఓ సెంటిమెంట్‌గా మారిపోయారు వెన్నెల కిశోర్. ఆయనకి సరైన క్యారెక్టర్ పడితే సినిమా హిట్ అనేది వారి ప్రగాఢ నమ్మకం. రీసెంట్గా విడుదలైన ‘#సింగిల్’లో హీరో శ్రీవిష్ణు ఫ్రెండ్‌గా మంచి పాత్ర చేశారాయన. ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోందని వెన్నెల కిశోర్ ఆనందం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో ముచ్చటించారు.
మనం చికెన్ బిర్యాని తింటున్నప్పుడు అప్పుడప్పుడు లివర్ పీస్ తగులుతుంటుంది. అది బిర్యానీకి డిఫరెంట్ టేస్ట్‌ని తెస్తుంది. ఇందులో నా క్యారెక్టర్ అలాంటిదే. హీరో శ్రీవిష్ణు స్పాంటేనియస్‌గా డైలాగుల్ని ఇంప్రువైజ్ చేసేస్తారు. అతని పక్కన, అంతే స్పాంటేనియస్‌గా రియాక్షన్ ఇచ్చే యాక్టర్ ఉండాలి. దానికి నేనైతే కరెక్ట్ అని డైరెక్టర్ కార్తీక్‌రాజ్ భావించారు. శ్రీవిష్ణు ఉండే ప్రతి సన్నివేశంలో నేను కూడా ఉండాలని ఆయన ఫిక్స్ అయ్యారు. ఆ ఆలోచన స్క్రిన్‌పై బాగా వర్కవుట్ అయ్యింది. ఈ కథ విన్నప్పుడే హిలేరియస్‌గా అనిపించింది. అదే ఎంటైర్టెన్మెంట్ తెరపై కూడా పండింది. నిజంగా నా సినిమాను నేను స్క్రీన్‌పై చూసుకోలేను. కానీ ఈ సినిమాను మాత్రం థియేటర్లో ఆడియన్స్‌తో కలిసి చూశా. ఆ రెస్పాన్స్ నాకు చాలా ఆనందాన్నిచ్చింది.