OMG | వెన్నెలకిశోర్, నందితా శ్వేత ప్రధానపాత్రల్లో నటించిన హారర్, కామెడీ ఎంటర్టైనర్ ‘ఓఎంజీ’. ‘ఓ మంచి ఘోస్ట్’ అనేది ఉపశీర్షిక. శంకర్ మార్తాండ్ దర్శకుడు. డా.అబినికా ఇనాబతుని నిర్మాత. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
‘ఈ బంగ్లాలో ఓ అమ్మాయిని చంపేశారు.. ఆ అమ్మాయే దెయ్యమై అందర్నీ చంపేస్తోందని కథలుకథలుగా చెప్పుకుంటున్నారు’ అనే డైలాగ్‌తో ఈ ట్రైలర్ మొదలైతే.. ‘ఇప్పటివరకూ ఆటాడితే ఎలా ఉంటుందో చూశారు.. ఇక వేటాడితే ఎలా ఉంటుందో చూపిద్దాం’ అనే డైలాగ్‌తో ట్రైలర్ ముగిసింది.
ఈ సినిమాలో సూపర్ నేచురల్, హారర్, థ్రిల్లింగ్, కామెడీ.. ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయని, ట్రైలర్‌ని మించే స్థాయిలో సినిమా ఉంటుందని, భయపెడుతూ, నవ్వించే సినిమా ఇదని మేకర్స్ తెలిపారు. నవమి గాయక్, షకలక శంకర్, రజత్ రాఘవ్, తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ఐ ఆండ్రూ, సంగీతం: అనూప్ రూబెన్స్.