Chaari 111 Movie | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ (Vennela Kishore) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చారి 111’ (Chaari 111). తమిళ ముద్దుగుమ్మ సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్గా నటిస్తుండగా.. టీజీ కీర్తికుమార్ (TG keerthy Kumar) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మార్చి 01న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఇప్పటినుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి కాన్సెప్ట్ టీజర్‌ను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమా ట్రైలర్‌ను ఫిబ్రవరి 12న సోషల్ మీడియా వేదికగా విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే ఓ సీటిలో అనుమానాస్పద ఘటనలు జరుగుతుంటాయి. అవి చేధించే రహస్య గూఢచారి పాత్రలో వెన్నెల కిషోర్ కనిపించనున్నారు. ఇక సీనియర్ నటుడు మురళి శర్మ ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. కిశోర్ సీక్రెట్ స్పైగా కనిపించనుండగా.. మురళి శర్మ స్పై ఏజెన్సీ హెడ్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాను బర్కత్ స్టూడియెస్ బ్యానర్‌పై అదితి సోని నిర్మిస్తుంది.
With Impeccable 𝗙𝘂𝗻 🤩
they are set to turn things 𝗩𝗶𝗼𝗹𝗲𝗻𝘁 🤘Brace yourself for a Slick and Entertaining #Chaari111Trailer on Feb 12th 💥#Chaari111 𝗜𝗻 𝗖𝗶𝗻𝗲𝗺𝗮𝘀 𝗳𝗿𝗼𝗺 𝗠𝗮𝗿𝗰𝗵 𝟭𝘀𝘁!#Vennelakishore @samyukthavv@barkatstudios @aditisoni1111… pic.twitter.com/ZBgakhpzVF
— BA Raju’s Team (@baraju_SuperHit) February 10, 2024