Zamana | తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల కాలంలో కంటెంట్ ఆధారిత సినిమాలకు సూపర్ క్రేజ్ పెరుగుతుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చిన్న సినిమా అయినా సరే చాలు కంటెంట్ బాగుంటే బ్లాక్ బస్టర్ హిట్టు చేసేస్తున్నారు ప్రేక్షకులు. ఇదే కోవలో కంటెంట్‌ను నమ్మి వస్తున్న చిత్రం జమానా (Zamana). బ్రో ఫేం సూర్య శ్రీనివాస్ (Surya srinivas), సంజీవ్ కుమార్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ మూవీతో భాస్కర్ జక్కుల డైరెక్టర్‌గా డెబ్యూ ఇస్తున్నాడు.
ఈ మూవీ టైటిల్ ప్రోమోను డైరెక్టర్ వెంకీ కుడుముల (Venky kudumula) లాంఛ్ చేశాడు. ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని వెంకీ కుడుముల అన్నాడు. భాస్కర్ జక్కుల విజన్‌ను తాను చాలా లైక్ చేస్తా. చార్మినార్ షాట్ సాలిడ్‌గా ఉందంటూ.. సూర్య శ్రీనివాస్, సంజయ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు వెంకీ కుడుముల. అడిగిన వెంటనే మా జమానా టైటిల్ ప్రోమోను లాంఛ్ చేసిన వెంకీ కుడుములకు సూర్య శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలియజేశాడు. ఆయనది లక్కీ హ్యాండ్. ఆయన చేతుల మీదుగా లాంఛ్ చేసిన జమాన సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్మకముందని ధీమా వ్యక్తం చేశాడు.
డైరెక్టర్ భాస్కర్ జక్కుల మాట్లాడుతూ .. చార్మినార్, ఓల్డ్ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో యూత్‌కు కనెక్ట్ అయ్యే విధంగా జమానా చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. తొలి సినిమా అయినా నటీనటులు, సాంకేతిక నిపుణులు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఈ కథని నమ్మి సినిమాను తెరకెక్కించిన మా నిర్మాతలకి ధన్యవాదాలు. త్వరలోనే మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకొస్తాం.. అంటూ జమానా టైటిల్ ప్రోమో రిలీజ్ చేసిన డైరెక్టర్ వెంకీ కుడుములకు కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వల్లభ క్రియేషన్స్, విఎస్ అసోసియేట్స్ బ్యానర్లపై తేజస్వి అడప, బొద్దుల లక్ష్మణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Jamana2
Zamana1
టైటిల్ ప్రోమో లాంఛ్ వీడియో..