Venki – Nag | సిల్వర్ స్క్రీన్‌పై స్టార్ హీరో కనిపించగానే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. అలాంటిది తెరపై ఇద్దరు స్టార్ హీరోలు స్క్రీన్ షేర్ చేసుకుంటే అభిమానుల ఆనందం మరింత రెట్టింపు అవుతుంది. ఈ మధ్య తెలుగు సినిమాల్లో మల్టీస్టారర్ ట్రెండ్ బాగా పాపులర్ అవుతోంది. ఈ ధోరణిని కొనసాగించే ప్లాన్‌లో ఉన్నారు ఇద్దరు హీరోలు. ముఖ్యంగా సీనియర్ హీరోల మధ్య మల్టీస్టారర్ కాంబినేషన్స్ అంటే అభిమానులకు ఒక ప్రత్యేకమైన అట్రాక్షన్. అలాంటి అరుదైన కాంబినేషన్లలో ఒకటి విక్టరీ వెంకటేష్ – కింగ్ నాగార్జున కలయిక.
వెంకటేష్‌కి సెంటిమెంట్, ఎమోషన్ ఎలివేషన్‌లో మంచి పట్టు ఉంది. నాగార్జున రొమాంటిక్ రోల్స్‌తో పాటు వర్సటైల్ నటనలో తనదైన ముద్ర వేసారు. ఈ ఇద్దరూ సంవత్సరాలుగా తమదైన శైలిలో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. తెరమీద వీళ్లిద్దరిని కలసి చూడాలన్న ఆసక్తి అభిమానుల్లో ఎప్పుడూ ఉంటుంది. ఆఫ్ స్క్రీన్ లో ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఇప్పుడు దగ్గుబాటి, అక్కినేని ఫ్యాన్స్ ఒక్కటే కోరుకుంటున్నారు. ఈ ఇద్దరు హీరోలు కలిసి మల్టీస్టారర్ చేయాలని. ఇద్దరూ సీనియర్ స్టార్స్ కావడం వల్ల, స్క్రీన్‌పై డామినేషన్ అనేది అస్సలు ఉండదు. పాత్రలు ఒకరివి తక్కువ ఒకరివి ఎక్కువా అనేది ఏ మాత్రం ఉండదు.
వాళ్ల మధ్య ఉన్న మ్యూచువల్ రెస్పెక్ట్ వల్ల మంచి స్క్రిప్ట్ వస్తే వెంటనే ఓకే చెబుతారు.నాగార్జున అయితే కథ బాగుంటే, తన పాత్రకు ప్రాధాన్యత తక్కువగా ఉన్నా కూడా ఓకే చెబుతాడు. వెంకటేష్ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్లో తిరుగులేని నటుడు. సో, ఓ మంచి కథతో వారిని కలిపే ప్రయత్నం చేస్తే అది ప్రేక్షకులకే కాదు ఇండస్ట్రీకి కూడా ఊపిరిపోసినట్టు ఉంటుంది. ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ తమ సినిమాల్లో బిజీగా ఉన్నా, సరైన టైమ్, కంటెంట్ ఉన్నప్పుడు మ్యాజిక్ చేయాలని భావిస్తున్నారు. మరి ఏ దర్శకుడు వారిద్దరితో మల్టీ స్టారర్ చేస్తాడు, ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళతాడో చూడాలి.