మధ్యతరగతి మందహాసాలు
సినీరంగంలో కొన్ని కాంబినేషన్స్ చాలా ప్రత్యేకం. అందులో త్రివిక్రమ్-వెంకటేష్ కూడా ఒకటి. గతంలో వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాలకు రైటర్‌గా పని చేశారు త్రివిక్రమ్. దాంతో వీరిద్దరి కలయికలో వస్తున్న తాజా చిత్రం ‘ఆదర్శకుటుంబం-ఏకే 47’ అందరిలో ఆసక్తిని పెంచింది. అక్టోబర్ 2న ఈ సినిమా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో శనివారం టీజర్‌ను విడుదల చేశారు.
సినీరంగంలో కొన్ని కాంబినేషన్స్ చాలా ప్రత్యేకం. అందులో త్రివిక్రమ్-వెంకటేష్ కూడా ఒకటి. గతంలో వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాలకు రైటర్‌గా పని చేశారు త్రివిక్రమ్. దాంతో వీరిద్దరి కలయికలో వస్తున్న తాజా చిత్రం ‘ఆదర్శకుటుంబం-ఏకే 47’ అందరిలో ఆసక్తిని పెంచింది. అక్టోబర్ 2న ఈ సినిమా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో శనివారం టీజర్‌ను విడుదల చేశారు. మధ్యతరగతి కుటుంబం తాలూకు సరదాలు, అల్లరి.. చివరగా ఓ సస్పెన్స్ ఎలిమెంట్ నేపథ్యంలో టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. త్రివిక్రమ్ తనదైన సంభాషణల ఛమక్కు చూపించగా, వెంకటేష్ చక్కటి హాస్యంతో సన్నివేశాలను రక్తికట్టించారు.
చివరగా వచ్చే యాక్షన్ సన్నివేశాలు కథేమిటో అనే ఆసక్తిని క్రియేట్ చేశాయి. ‘నాకు ఫ్యామిలీ ఇమేజ్ ఉందని తెలుసు. కానీ సిచ్యుయేషన్ డిమాండ్ చేస్తే యాక్షన్ చేయడానికి వెనకాడను’ ‘నది కట్టుదాటితే వరద అంటారు. సముద్రం దాటితే ఉప్పెన అంటారు. అదే సామాన్యుడు దాటితే బలమైన పదం మీరే వెతకండి సార్’ అంటూ వెంకటేష్ చెప్పిన డైలాగ్స్ హైలైట్‌గా నిలిచాయి. శ్రీనిధి శెట్టి, నారా రోహిత్, నివేదా పేతురాజ్, యువినా, రాజ్ప్రజ్వల్, రావు రమేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరకర్త. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. రచన-దర్శకత్వం: త్రివిక్రమ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

