దగ్గుబాటి వెంకటేశ్, రానా ప్రధాన పాత్రల్లో కలిసి నటిస్తున్న యాక్షన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. అమెరికన్ క్రైమ్ డ్రామా సిరీస్ ‘రే డోనవన్’ ఆధారంగా తెరకెక్కుతున్న.. ఈ వెబ్ సిరీస్ కి సుపర్ణ వర్మ, కరణ్ అన్షుమన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సిరీస్ త్వరలో ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ ప్రమోషన్స్ ప్రారంభించింది. అయితే ప్రమోషన్స్‌లో భాగంగా రానాకు, నెట్‌ఫ్లిక్స్‌కు వార్నింగ్ ఇస్తున్నట్లు ‘వెంకీమామ’ ట్విట్టర్లో ఓ వీడియోను షేర్ చేశాడు.
చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నెట్‌ఫ్లిక్స్.. రానా నాయుడులో హీరో ఎవరు? నేను. అందంగా కనిపించేది ఎవరు? నేను. స్టార్ ఎవరు? అది కూడా నేనే. ఫ్యాన్స్ కూడా నా వాళ్లే ఉన్నారు కాబట్టి ఈ షోకి రానా నాయుడు కాదు ‘నాగా నాయుడు’ అని టైటిల్ పెట్టండి. నాతో మజాక్‌లొద్దు.. మజాక్ మజాక్ మే అబ్దుల్ రజాక్ అవుతుంది అని నెట్‌ఫ్లిక్స్‌కి వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఈ వీడియో కొద్ది సేపటికే వైరల్‌గా మారింది. కాగా ఈ వీడియోలో వెంకీ లుక్ బాగుందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
దీనికి నెట్‌ఫ్లిక్స్ ట్విట్టర్లో స్పందిస్తూ.. ఈ సమస్యను ఎలా పరిష్కరించగలం అంటూ రానాని ట్యాగ్ చేసింది.
Tera naam bhi meine rakha, show ka naam bhi mein rakhega.#RanaNaidu ki aisi ki taisi. @RanaDaggubati @NetflixIndia pic.twitter.com/R3GYlwZsEl
— Venkatesh Daggubati (@VenkyMama) February 13, 2023