F3 Song Promo Released | విక్టరి వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఎఫ్3’. అనీల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు. తమన్నా, మెహరిన్ హీరోయిన్లుగా నటించారు. 2019 లో సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను సాధించిన ‘ఎఫ్2’ సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా సునీల్ కీలక పాత్రలో నటించనున్నాడు. తాజాగా ఈ చిత్రంలోని మాస్ బీట్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు.
‘ఊ ఆ ఆహా ఆహా’ అంటూ సాగే మాస్ బీట్ ప్రోమో ఆకట్టుకుంటుంది. ‘ఎఫ్2’లో వచ్చిన ‘గిర్రా గిర్రా’ సాంగ్ తరహాలో ఈ పాట ఉండనున్నట్లు తెలుస్తుంది. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను సునిధి చౌహన్, లవితా లోబో, దేవి శ్రీ ప్రసాద్, అభిషేక్లు ఆలపించారు. ఈ పెప్పి నెంబర్ ఫుల్ లిరికల్ వీడియోను ఏప్రిల్ 22న విడుదల చేయనున్నట్లు తెలిపారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం మే 27న విడుదల కానుంది.