AK47 | గాంధీ జయంతికి రాబోతున్న వెంకీ-త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’.?
Adarsha Kutumbham | విక్టరీ వెంకటేష్ అభిమానులకు వరుసగా అదిరిపోయే అప్డేట్స్ వస్తున్నాయి.
Adarsha Kutumbham | విక్టరీ వెంకటేష్ అభిమానులకు వరుసగా అదిరిపోయే అప్డేట్స్ వస్తున్నాయి. అనిల్ రావిపూడి సినిమా గ్రాండ్‌గా ప్రారంభమైన జోష్‌లో ఉండగానే, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో వెంకీ మామ కలయికలో రాబోతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’పై క్రేజీ బజ్ స్టార్ట్ అయింది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ సెట్ కావడంతో ఇండస్ట్రీలో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలవడంతో, ఈసారి హ్యాట్రిక్ హిట్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.
తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన రిలీజ్ డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2, 2026న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ అలియాస్ చినబాబు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నారా రోహిత్, పూజిత పొన్నాడ కీలక పాత్రలు పోషిస్తుండగా, రావు రమేష్, బ్రహ్మాజీ, నరేష్ వంటి సీనియర్ నటులు సందడి చేయనున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, వెంకటేష్ టైమింగ్ హైలైట్‌గా నిలుస్తాయని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. మరి అక్టోబర్ 2 డేట్‌పై అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

