Trivikram | వెంకటేశ్- త్రివిక్రమ్.. ఈ కాంబినేషన్ సినిమా కోసం ఆశించని ప్రేక్షకుడు లేడు. వెంకటేశ్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలకు త్రివిక్రమ్ మాటలు రాశారు. దర్శకుడయ్యాక ఆయన వెంకీతో సినిమా చేస్తారని అందరూ భావించారు. కానీ ఎందుకో ఆ కాంబినేషన్ సెట్ కాలేదు. అయితే.. ఎట్టకేలకు వెంకీ, త్రివిక్రమ్‌ల కాంబినేషన్ సెట్ అయ్యిందని విశ్వసనీయ సమాచారం.
వాస్తవానికి బన్నీ హీరోగా త్రివిక్రమ్ ఓ సినిమా చేయాలి. అయితే.. అట్లీ ప్రాజెక్ట్‌ని ముందు ఓకే చేశారు బన్నీ. ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యే సరికి దాదాపు ఏడాదిన్నర పట్టడం ఖాయం. ఈ లోపు బన్నీ స్క్రిప్ట్ పూర్తి చేస్తూ, మరోవైపు వెంకీతో సినిమా కానిచ్చేయాలని త్రివిక్రమ్ నిర్ణయించారట. వెంకటేశ్‌కి సరిగ్గా సరిపోయే ఫ్యామిలీ డ్రామా సబ్జెక్ట్ త్రివిక్రమ్ దగ్గర సిద్ధంగా ఉందట. త్వరలో షూటింగ్ మొదలుపెట్టి, త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో త్రివిక్రమ్ ఉన్నారట. ఆ వెంటనే బన్నీ సినిమా మొదలుపెడతారన్నమాట.