Venkatesh Maha – SatyaDev | ‘కేరాఫ్ కంచరపాలెం’ ,’ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ వంటి చిత్రాలతో స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేశ్ మహా(Venkatesh Maha) చాలా రోజుల తర్వాత తన కొత్త సినిమాను ప్రారంభించాడు. వెంకటేశ్ మహా దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం రావుబహదూర్(RaoBahadur). ఈ సినిమాలో సత్యదేవ్ కథానాయకుడిగా నటించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది. ఇందులో సత్యదేవ్ రావు బహదుర్ అనే జమీందార్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. జీఎంబీ, శ్రీచక్ర ఎంటర్టైనమెంట్స్ బ్యానర్లపై అనురాగ్ రెడ్డి, చింత గోపాలకృష్ణ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించబోతున్నారు. ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే.. సత్యదేవ్ వృద్ధుడి పాత్రలో ఉండగా.. అతడి చూట్టు చిన్నపిల్లలు ఉండడం చూడవచ్చు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
Here he is…
The man who’s been living in my head for the past 5 years.Presenting to you @ActorSatyaDev as Rao Bahadur.
Presented by @GMBents 🌟
Produced by @SrichakraasEnts @AplusSMoviesRemember, “అనుమానం పెనుభూతం.”#RaoBahadur #రావుబహదూర్#RB 🔥
In cinemas Summer 2026.… pic.twitter.com/xeHg8Schac— Venkatesh Maha (@mahaisnotanoun) August 12, 2025