అగ్ర హీరో వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శకుటుంబం’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీని తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో కల్యాణ్‌రామ్‌తో కలిసి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని చేయబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆయన మరో చిత్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది.
‘విశ్వంభర’ దర్శకుడు వశిష్టతో ఓ చిత్రానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. స్టోరీ లైన్ నచ్చడంతో వెంకటేష్ ఈ సినిమాకు సూత్రప్రాయంగా అంగీకరించారని, ఫుల్ నరేషన్ అయిన తర్వాత సినిమాపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.