Venkatesh | ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు అగ్ర కథానాయకుడు వెంకటేష్. 300కోట్ల పైచిలుకు వసూళ్లతో తెలుగు ప్రాంతీయ సినిమా కలెక్షన్స్‌లో రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా ఏమిటన్నది అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నది. ప్రస్తుతం వెంకటేష్ కథల్ని వింటున్నారని తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన సినిమా చేసే అవకాశం ఉందని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నది. ఇటీవలే వెంకటేష్‌ను కలిసి సురేందర్ రెడ్డి కథ చెప్పారని అంటున్నారు. అన్నీ కుదిరతే వెంకటేష్ ఈ సినిమాకు అంగీకరించే అవకాశాలున్నాయని సమాచారం. వెంకటేష్ నటించిన ‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్ సెకండ్ సీజన్ త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.