వైవిధ్యమైన కథల్ని ఎంచుకోవడంలో వెంకటేశ్ మాస్టర్. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. క్రైమ్ జోనర్లో నడిచే కథతో రూపొందుతోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. ఇదిలావుంటే.. తాజాగా మరో సినిమాకు వెంకీ పచ్చజెండా ఊపారని ఫిల్మ్వర్గాల టాక్. ‘సామజవరగమన’ చిత్రంతో రచయితగా గుర్తింపు తెచ్చుకున్న నందు కథకు వెంకీ ఓకే చేశారట. చిట్టూరి శ్రీనివాస్ ఈ చిత్రానికి నిర్మాత. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. దసరాకి ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానున్నదని తెలుస్తున్నది. వెంకటేశ్, త్రిష ఇప్పటికే ఆడవారిమాటలకు అర్థాలువేరులే, నమో వేంకటేశా చిత్రాల్లో జంటగా నటించారు. ఇది వారిద్దరూ కలిసి నటించనున్న మూడో సినిమా అన్నమాట.