ఈ పానిండియా యుగంలో రీజనల్ మూవీస్ కూడా మూడొందల కోట్లు కొల్లగొట్టగలవని నిరూపించిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఊహించని విజయం ఇది. టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఎవరికీ లేనంత పెద్ద విజయాన్ని ‘సంక్రాంతికి వస్తున్నాం’తో అందుకున్నారు వెంకటేష్. దాంతో ఆయన నెక్ట్స్ సినిమాపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో వెంకీ నెక్ట్స్ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నది.
ఆయన చేయబోయే సినిమా ద్వారా ఓ రచయిత దర్శకునిగా పరిచయం కానున్నారట. వెంకటేష్ ప్రధాన పాత్ర పోషించనున్న ఈ సినిమాలో.. హీరో శ్రీవిష్ణు కూడా కీలక పాత్ర పోషించనున్నట్టు సమాచారం. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తరహాలోనే పూర్తిస్థాయి వినోదభరితమైన స్క్రిప్ట్‌తో ఈ సినిమా రూపొందనున్నదట. దాదాపు సినిమా ఖరారైందని, అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమని అని తెలుస్తున్నది.