Thalapathy 68 | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్తో అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ప్రస్తుతం లియో సినిమాతో బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో మరోవైపు దళపతి 68కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. తాజాగా దళపతి 68 (Thalapathy 68) సినిమాకు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. తాజాగా వెంకట్ ప్రభు (Venkat Prabhu) అండ్ దళపతి విజయ్ టీం లాస్ ఏంజెల్స్‌లో ల్యాండ్ అయింది. లాస్ ఏంజెల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగిన విజయ్ను అక్కడే ఉన్న కెమెరాలు క్లిక్ మనిపించాయి.
చెన్నై నుంచి సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో సింగపూర్, టోక్యో మీదుగా లాస్ ఏంజెల్స్ చేరుకుంది విజయ్ టీం. ఎయిర్‌పోర్టులో లైన్లో ఉన్న విజయ్ స్టిల్ ఒకటి ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ఈ చిత్రంలో విజయ్ డ్యుయల్ రోల్లో నటిస్తుండగా.. విజయ్‌కు లాస్ ఏంజెల్స్‌లో లుక్ టెస్ట్ చేయబోతున్నారని తాజా సమాచారం. వెంకట్ ప్రభు డైరెక్షన్లో పాన్ ఇండియా కథాంశంతో రాబోతున్న దళపతి 68లో సీనియర్ హీరోయిన్ జ్యోతిక (Jyothika) ఫీ మేల్ లీడ్ రోల్లో నటించబోతుంది. మరో హీరోయిన్గా ప్రియాంకా ఆరుళ్ మోహన్ పేరు వినిపిస్తోండగా.. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ ప్రాజెక్ట్‌లో ఎస్జే సూర్య (SJ Suryah) విలన్‌గా కనిపించబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. దళపతి 68కు సంబంధించిన మరిన్ని వివరాలపై రాబోయే రోజుల్లో అప్డేట్స్ అందించనుంది టీం.
ఎయిర్‌పోర్టులో విజయ్..
Thalapathy Tharisanam 💙#ThalapathyVijay & the #Thalapathy68 team, accompanied by @vp_offl & @archanakalpathi, arrived at Los Angeles International Airport ✈️ (LAX) at 12:30 AM today. They traveled from Chennai to Los Angeles via Singapore & Tokyo on Singapore Airlines Flight. pic.twitter.com/HgzLX5FHGW
— KARTHIK DP (@dp_karthik) August 30, 2023