OG | టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రాల్లో ఒకటి ఓజీ (OG). సాహో ఫేం సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే మేకర్స్ లాంఛ్ చేసిన HUNGRYCHEETAH గ్లింప్స్ నెట్టింట హల్ చల్ చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ అమాంతం పెంచేస్తోంది. ఈ మూవీలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఓజీలో అలనాటి హీరో, సీనియర్ యాక్టర్ వెంకట్ (venkat) కీ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా న్యూఇయర్ విషెస్‌తో బ్లాక్ బస్టర్ లోడింగ్ లొకేషన్ స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. బూట్‌కట్ ప్యాంట్, ఫుల్ షర్ట్‌లో ఉన్న వెంకట్ చేతిలో పిస్తోల్ పట్టుకున్న లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. 2024లో పవన్‌కల్యాణ్ అన్న బ్లాక్ బస్టర్ లోడింగ్.. ఈ పోస్టర్‌ను తెగ వైరల్ చేస్తున్నారు అభిమానులు. పవన్ కల్యాణ్ పొలిటికల్ కమిట్మెంట్స్తో బిజీగా ఉండగా.. ఓజీ షూటింగ్ నయా అప్డేట్ రావాల్సి ఉంది.
వెంకట్ ఓ ఇంటర్వ్యూలో ఓజీ గురించి మాట్లాడుతూ.. ఓజీలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని.. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను.. అలా చెప్తే సుజిత్ నన్ను చంపేస్తడు. ఎందుకంటే ఓజీ హై టెక్నికల్ వాల్యూస్‌తో భారీ స్థాయిలో వస్తుంది. టాలెంటెడ్ యాక్టర్లు భాగస్వామ్యమైన ఓజీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి రాబోతున్న మరో భారీ సినిమా కానుంది. గ్లింప్స్‌లో పవన్ కల్యాణ్ అదరగొట్టేశాడు.. విజువల్స్ ఔరా అనిపించేలా ఉన్నాయని చెప్పుకొచ్చాడు వెంకట్.
ఓజీ గ్లింప్స్‌లో పవన్ కల్యాణ్ ఓవైపు వారియర్‌గా.. మరోవైపు స్టైలిష్ అవతార్‌లో కనిపిస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ఈ మూవీకి రవి కే చంద్రన్ సినిమాటోగ్రాఫర్ కాగా.. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్.
OG Happy Newyear #PawanKalyan అన్న బ్లాక్ బస్టర్ 2024 లోడింగ్ 💥💪
:- #Venkat#TheyCallHimOG @DVVMovies pic.twitter.com/ytx7c4m4Sf— KARNATAKA PawanKalyan FC™ (@KarnatakaPSPKFC) January 1, 2024
ఓజీ గ్లింప్స్..
ఓజీ షూట్ లొకేషన్లో వెంకట్ ఇలా..
Hero #Venkat Doing Important role in @PawanKalyan‘s #TheyCallHimOG 🔥 pic.twitter.com/pa44ZqfI9X
— KARNATAKA PawanKalyan FC™ (@KarnatakaPSPKFC) October 29, 2023