Veera Simha Reddy | త్వరలోనే వీరసింహారెడ్డి (Veera Simha Reddy)గా గర్జించేందుకు రెడీ అవుతున్నాడు నందమూరి బాలకృష్ణ (Balakrishna). స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో రాయలసీమలో కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ వీడియోలు, సాంగ్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి.
కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 6న ఒంగోలులోని ఏబీఎం గ్రౌండ్స్‌లో ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈవెంట్ వేదిక మారింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈవెంట్‌ను ప్రత్యామ్నాయ ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు వీరసింహారెడ్డి టీంను కోరారు. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఒంగోలులోని అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్‌కు మార్చారు. ఇదే విషయాన్ని మేకర్స్ ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ ద్వారా అందరికి తెలియజేశారు.
వీరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ధునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్, హనీ రోజ్, చంద్రికా రవి, పీ రవిశంకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Venue changed but the MASS fervor remains 🔥🔥#VeeraSimhaReddy Grand Pre Release Event on 6th Jan from 6 PM onwards at Arjun Infra Ground, Ongole
Natasimham #NandamuriBalakrishna @megopichand @shrutihaasan @varusarath5 @OfficialViji @MusicThaman @shreyasgroup @SonyMusicSouth pic.twitter.com/5C7n8EjP8Y
— Mythri Movie Makers (@MythriOfficial) January 5, 2023
వీరసింహారెడ్డి మేకింగ్ స్టిల్స్..
Making Stills from #VeeraSimhaReddy with the GOD OF MASSES 🔥
Here are the #FramesOfVeeraSimhaReddy 💥
Mass Jaathara in Theatres from JAN 12 💥
Natasimham #NandamuriBalakrishna @megopichand @shrutihaasan @varusarath5 @MusicThaman @RishiPunjabi5 @SonyMusicSouth pic.twitter.com/blb7QgpBYc
— Mythri Movie Makers (@MythriOfficial) December 26, 2022
వీరసింహారెడ్డి టీజర్..
జై బాలయ్య మాస్ ఆంథమ్ సాంగ్..
సుగుణ సుందరి లిరికల్ వీడియో సాంగ్..
మా బావ మనోభావాలు సాంగ్ ప్రోమో..