రామ్ కార్తీక్, కశ్వి జంటగా నటిస్తున్న చిత్రం ‘వీక్షణం’. మనోజ్ పల్లేటి దర్శకుడు. పద్మనాభ సినీ ఆర్ట్స్ పతాకంపై పి.పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎన్నెన్నో..’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.
మెలోడీ ప్రధాన ప్రేమగీతంగా ఈ పాటను తీర్చిదిద్దారు. సమర్థ్ గొల్లపూడి సంగీతాన్ని అందించిన ఈ పాటను రెహ్మాన్ రాయగా సిధ్ శ్రీరామ్ ఆలపించారు. సస్పెన్స్, మిస్టరీ, థ్రిల్లింగ్ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, చిత్రీకరణ పూర్తయిందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సాయిరామ్ ఉదయ్, సంగీతం: సమర్థ్ గొల్లపూడి, దర్శకత్వం: మనోజ్ పల్లేటి.