Matka | టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ (Varun Tej) బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. ఈ సినిమాల్లో ఒకటి మట్కా (Matka). పలాస 1978 ఫేం కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మట్కా షూటింగ్ వరుణ్ తేజ్, ఇతర నటీనటులతో ఇప్పటికే అధికారికంగా షురూ అయింది.
చాలా రోజుల తర్వాత మట్కా షూటింగ్ అప్డేట్ అందించి మెగా అభిమానులను ఖుషీ చేస్తున్నాడు వరుణ్ తేజ్.
175 రోజుల తర్వాత కొత్త ఎనర్జీ, ఆశలతో జీవితానికి మట్కా రెట్రో మ్యాజిక్ అందించేందుకు సెట్స్‌లోకి తిరిగొచ్చాం.. అంటూ వింటేజ్ టెలిఫోన్‌ను చేతులో పట్టుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు వరుణ్ తేజ్. ఈ స్టిల్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఈచిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మట్కా టైటిల్ టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ సూపర్ బజ్ క్రియేట్చేస్తోంది. మట్కా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో సాగే కథతో వరుణ్ తేజ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రాబోతుంది. ఈ మూవీలో వరుణ్ తేజ్ కథానుగుణంగా నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో ఈ చిత్రంలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ నోరాఫతేహి మరో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
Back on set after 175 days with new energies and aspirations, ready to bring the retro magic of ‘Matka’ to life! 🎬✨#MATKA pic.twitter.com/8Qnvkb6vB7
— Varun Tej Konidela (@IAmVarunTej) June 20, 2024
మట్కా టైటిల్ టీజర్..