ఇరవైనాలుగేళ్ల స్పాన్ ఉన్న కథ ‘మట్కా’
మెగా ఫ్యామిలీలో విభిన్నంగా సినిమాలు ఎంపిక చేసుకుంటూ విజయాలను అందుకుంటున్న హీరో వరుణ్‌తేజ్. మిగతా హీరోలంతా కమర్షియల్ డైరెక్టర్లకు ప్రాధాన్యత ఇస్తూవుంటే, వరుణ్ మాత్రం కాన్సెప్ట్‌కే తొలి ప్రాధాన్యతనిస్తూ అభిరుచి గల దర్శకులతో సినిమా చేయడానికే ఆసక్తి చూపుతున్నాడు.
మెగా ఫ్యామిలీలో విభిన్నంగా సినిమాలు ఎంపిక చేసుకుంటూ విజయాలను అందుకుంటున్న హీరో వరుణ్‌తేజ్. మిగతా హీరోలంతా కమర్షియల్ డైరెక్టర్లకు ప్రాధాన్యత ఇస్తూవుంటే, వరుణ్ మాత్రం కాన్సెప్ట్‌కే తొలి ప్రాధాన్యతనిస్తూ అభిరుచి గల దర్శకులతో సినిమా చేయడానికే ఆసక్తి చూపుతున్నాడు. ‘పలాస’ఫేం కరుణకుమార్ దర్శకత్వంలో ఆయన నటించనున్న చిత్రం ‘మట్కా’. వైర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్‌రెడ్డి కలిసి భారీ ఎత్తున ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో మొదలుకానుంది.
1958 నుంచి 1982 మధ్యకాలంలో జరిగే కథ ఇది. అందుకే అప్పటి వాతావరణానికి అద్దం పట్టేలా భారీ సెట్టింగులను నిర్మిస్తున్నారు. ఇందులో వరుణ్ నాలుగు భిన్నమైన గెటప్పుల్లో కనిపిస్తాడని, తన కెరీర్లోనే హయ్యస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందనున్న ఈ చిత్రంలోని పాత్ర కోసం వరుణ్ మేక్ఓవర్ అవుతున్నారని దర్శకుడు చెప్పారు. నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నవీన్‌చంద్ర, కన్నడ కిశోర్ కీలక పాత్రధారులు. అజయ్‌ఘోష్, మైమ్ గోపి, రూపలక్ష్మి, విజయరామరాజు, జగదీశ్, రాజ్ తిరందాస్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జీవీ ప్రకాశ్‌కుమార్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

