Varun Tej | వరుణ్‌తేజ్ తాజా సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటైర్టెన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకుడు. ఈ సినిమా కథ విషయంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రాయలసీమ నేపథ్యంతో కూడిన హారర్ కథతో ఈ సినిమా తెరకెక్కనున్నదట. టైటిల్‌కి తగ్గట్టే ఈ సినిమాలో కొరియన్ బ్యాక్‌డ్రాప్ కూడా ఉంటుందని తెలిసింది.
ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని ఓ కొత్త పాయింట్‌తో ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఇదిలావుంటే ఈ సినిమాలో కథానాయికగా రితికా నాయక్ సెలక్టయింది. ‘అశోకవనంలో అర్జునకల్యాణం’ ఈ అమ్మాయి తొలి సినిమా. ఆ తర్వాత ‘హాయ్ నాన్న’లో కూడా కనిపించింది. ప్రస్తుతం ‘మిరాయ్’లో నటిస్తున్నది. ఇటీవలే ఈ సినిమా కోసం రితికకు టెస్ట్ లుక్ కూడా నిర్వహించారట. జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.