వరుణ్ తేజ్ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ ఇండో కొరియన్ హారర్ కామెడీ మూవీ రానున్నది. ‘వీటీ 15’(వర్కింగ్ టైటిల్)తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటైర్టెన్మెంట్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ని విజయవంతంగా ఈ సినిమా పూర్తి చేసుకున్నది. హైదరాబాద్, అనంతపూర్ పరిసరాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించామని, ఫస్ట్‌హాఫ్‌లోని థ్రిల్లింగ్ సీన్స్, హ్యూమర్ సీన్స్ ఈ షెడ్యూల్లోనే పూర్తి చేశామని, రీతికా నాయక్, సత్య, మిర్చి కిరణ్ ఈ సినిమాలో కామెడీ మెరుపులు మెరిపించారని మేకర్స్ తెలిపారు.
వరుణ్‌తేజ్, రీతికా నాయక్‌లపై పల్లెటూరు నేపథ్యంలో చిత్రీకరించిన అనంతపూర్ షెడ్యూల్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని వారు పేర్కొన్నారు. త్వరలోనే కొరియాలో ఈ సినిమా మూడో షెడ్యూల్ మొదలు కానుంది. కథలోని కీలక పార్ట్‌ని ఈ షెడ్యూల్లోనే పూర్తి చేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.థమన్.