హీరో వరుణ్‌తేజ్ ఈ మధ్య వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తున్నారు. 2018లో వచ్చిన ‘తొలిప్రేమ’ తర్వాత ఆయన్నుంచి పూర్తిస్థాయి ప్రేమకథ రాలేదు. రీసెంట్గా ‘రాధేశ్యామ్’ దర్శకుడు రాధాకృష్ణ ఓ డీసెంట్ ప్రేమకథను వరుణ్‌కు వినిపించారట. ఇదో క్లాసికల్ లవ్‌స్టోరీ అని సమాచారం. ప్రాజెక్ట్ దాదాపు ఖరారైనట్టేనని తెలుస్తున్నది. ఈ సినిమా నిర్మించేదెవరు? షూటింగ్ మొదలయ్యేదెప్పుడు? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానాలు రానున్నాయి. ప్రస్తుతం వరుణ్‌తేజ్ ‘కొరియన్ కనకరాజు’ అనే సినిమా చేస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్నది. ఆచార్య సెట్లో ఓ ఐటమ్ సాంగ్‌ని మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే రాధాకృష్ణ కథను వరుణ్ పట్టాలెక్కిస్తారని సమాచారం.