సినిమా విజయంపై నమ్మకంతో ఉన్నా
16ఏళ్ల వాసు అనే కుర్రాడు 55ఏళ్ల ‘మట్కా’ కింగ్‌లా ఎలా మారాడు? అనేది ఈ కథ. మంచి టీమ్‌తో పనిచేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది. గొప్ప దర్శకుడు కరుణకుమార్. నాలోని నటుడ్ని కొత్తగా చూపించారాయన. సినిమా విజయంపై నమ్మకంతో ఉన్నా. విశాఖపట్టణం అంటే సముద్రం గుర్తుకురావాలి. లేదా వాసుగాడు గుర్తుకురావాలి.
“16ఏళ్ల వాసు అనే కుర్రాడు 55ఏళ్ల ‘మట్కా’ కింగ్‌లా ఎలా మారాడు? అనేది ఈ కథ. మంచి టీమ్‌తో పనిచేసే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది. గొప్ప దర్శకుడు కరుణకుమార్. నాలోని నటుడ్ని కొత్తగా చూపించారాయన. సినిమా విజయంపై నమ్మకంతో ఉన్నా. విశాఖపట్టణం అంటే సముద్రం గుర్తుకురావాలి. లేదా వాసుగాడు గుర్తుకురావాలి. ఈ డైలాగ్‌కి తగ్గట్టే సినిమా ఉంటుంది.” అని వరుణ్‌తేజ్ అన్నారు. ఆయన హీరోగా రూపొందిన పీరియాడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘మట్కా’. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ కథానాయికలు. కరుణకుమార్ దర్శకుడు. డాక్టర్ విజయేందర్‌రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మాతలు. ఈ నెల 14న సినిమా విడుదలకానుంది.
ఈ సందర్భంగా వైజాగ్‌లో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో వరుణ్‌తేజ్ మాట్లాడారు. దర్శకుడు కరుణకుమార్ మాట్లాడుతూ ‘వైజాగ్‌కు మనకు తెలీని చరిత్ర ఉంది. దాన్ని మీకు చూపించబోతున్నా. వైజాగ్ అనేది యారాడకొండ కింద ఉండే చిన్న మత్స్యకార గ్రామం. ఇప్పుడు ప్రపంచపటంలో ఓ సూపర్ పవర్. ముంబైకీ, వైజాగ్‌కీ దగ్గర పోలికలుంటాయి. ముంబైలో సెటిలర్స్ ఎక్కువ. అలాగే వైజాగ్‌లోనూ సెటిలర్స్ ఎక్కువ. కానీ వైజాగ్‌లో పుట్టి పెరిగి, వైజాగ్ మట్టిగా మారిపోయిన చాలామంది జీవితాలు ఈ జనరేషన్‌కి తెలీదు. ఆ జీవితాలను రీక్రియేట్ చేసి చూపించే ప్రయత్నమే ‘మట్కా’. ఒకనాటి వైజాగ్ నేరసామాజ్యం కూడా ఇందులో ఉంటుంది. మనిషిలోని మంచీచెడుని డిస్కస్ చేసే సినిమాఇది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలుపుతున్నా’ అని చెప్పారు. నిర్మాతలుకూడా మాట్లాడారు. యూనిట్ మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

