Matka | వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రచార పర్వంలో వేగాన్ని పెంచారు. మంగళవారం 30డేస్ కౌంట్‌డౌన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘వయొలెన్స్ విత్ విజన్’ అనే క్యాప్షన్‌తో ఉన్న ఈ పోస్టర్లో వరుణ్‌తేజ్ పవర్ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు.
కొన్నేళ్ల క్రితం దేశంలో సంచలనం సృష్టించిన యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, వరుణ్‌తేజ్ నాలుగు గెటప్స్‌లో కనిపిస్తారని, ఓ సాధారణ యువకుడు అత్యంత బలమైన శక్తిగా ఎదిగిన వైనాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నామని మేకర్స్ తెలిపారు. నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్‌చంద్ర, అజయ్‌ఘోష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఏ.కిషోర్ కుమార్, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, నిర్మాతలు: విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కరుణ కుమార్.