రెండు దేశాలు, రెండు మనసులు మధ్య జరిగే అంతర్మథనం నేపథ్యంలో వరుణ్‌తేజ్ నటిస్తున్న చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తిప్రతాప్‌సింగ్ హడా దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సందీప్ ముద్దా నిర్మాత. మానుషి చిల్లర్ కథానాయిక. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ సినిమాలో వరుణ్‌తేజ్ ఎయిర్‌ఫోర్స్ పైలైట్‌గా నటిస్తున్నాడు. మనదేశ వైమానికదళ ధైర్యసాహసాలను, భయంకరమైన వైమానిక దాడులను కళ్లకు కట్టే సినిమా ఇదని, వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమా ఉంటుందని దర్శకుడు చెప్పారు. ఇదిలావుంటే, ఈ సినిమాకు సంబంధించిన నాన్ థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్, స్ట్రీమింగ్, ఆడియో హక్కులన్నీ కలిపి యాభైకోట్లకు పైగా అమ్ముడుపోయాయి.
వరుణ్‌తేజ్ కెరీర్లో ఈ స్థాయి బిజినెస్ ఫస్ట్‌టైమ్. ఇక తెలుగు, హిందీ భాషల్లో థియేట్రికల్ రైట్స్ కోసం భారీ ఆఫర్లు వస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. అమీర్‌ఖాన్, సిద్దార్థ్ రాజ్‌కుమార్‌లతో కలిసి శక్తిప్రతాప్‌సింగ్ రచించి, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 8న విడుదల కానుంది. ఈ చిత్రానికి నిర్మాణం : సోనీపిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్.