Matka | టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ (Varun Tej) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి పలాస 1978 ఫేం కరుణకుమార్ దర్శకత్వంలో నటిస్తోన్న మట్కా (Matka). ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. కాగా చాలా రోజుల క్రితం మొదలైన ఈ సినిమాకు సంబంధించి కొన్ని రోజులుగా కొత్త అప్డేట్ ఏం రాలేదని తెలిసిందే. మట్కా నయా షెడ్యూల్ షూట్ కోసం రెడీ అవుతుందన్న వార్త ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
మట్కా నెక్ట్స్ షెడ్యూల్ జూన్ 12 నుంచి షురూ కానుందని తాజా వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం మట్కా నెక్ట్స్ షెడ్యూల్ 40 రోజులపాటు సాగనుంది. ఈ షెడ్యూల్ కోసం వింటేజ్ వైజాగ్‌ను చూపించేలా ప్రొడక్షన్ డిజైన్ టీం స్పెషల్ సెట్ ఒకటి వేశారట. వరుణ్ తేజ్, మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి, నవీన్ చంద్ర ఈ షూట్లో పాల్గొనబోతున్నారని ఇన్సైడ్ టాక్. ఈ షెడ్యూల్‌తో మేజర్ పోర్షన్ పూర్తి కానుందని తెలుస్తోంది. మరి వరుణ్ తేజ్ టీం కొత్త షెడ్యూల్‌పై ఏదైనా అధికారిక అప్డేట్ ఇస్తారనేది చూడాల్సి ఉంది.
మట్కా చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మట్కా టైటిల్ టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. మట్కా వరుణ్ తేజ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో సాగే కథతో రాబోతుంది. ఈ మూవీలో వరుణ్ తేజ్ కథానుగుణంగా నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ నోరాఫతేహి మరో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
మట్కా టైటిల్ టీజర్..