హీరో వరుణ్‌తేజ్ తండ్రి అయ్యారు. ఆయన సతీమణి లావణ్య త్రిపాఠి బుధవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా వరుణ్‌తేజ్ తన ఎక్స్ ఖాతాలో ఫొటోను పోస్ట్ చేశారు. ఇది సోషల్‌మీడియాలో వైరల్ అయింది. అగ్ర నటుడు చిరంజీవి ఆసుపత్రికి వెళ్లి వరుణ్, లావణ్య దంపతులకు శుభాకాంక్షలందజేశారు.
వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి ‘మిస్టర్’ (2017) చిత్రంలో కలిసి నటించారు. అక్కడే వారి మధ్య ప్రేమ చిగురించింది. ఈ జంట 2023 నవంబర్‌లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు.