Varun Tej-Lavanya Tripathi | టాలీవుడ్ లవ్‌బర్డ్స్ వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠీలు త్వరలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. జూన్‌లో అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ జంట డిసెంబర్ 1న అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోబోతున్నారు. వీరి పెళ్లికి ఇటలీ వేదిక కానుంది. ఇటలీలోని టుస్కానీ విలేజ్‌లో వీరిద్దరూ డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు. ఇప్పటికే పెళ్లి పనులు కూడా స్టార్ట్ అయిపోయానని సమాచారం. నాలుగు రోజుల పాటు జరుగనున్న ఈ పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు.
ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ జంట ఇటలీకి పయనమైనట్లు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇన్‌స్టా స్టోరీ ద్వారా వెల్లడించాడు. గత రెండు, మూడు ముందే మెగా ఫ్యామిలీలో పెళ్లి సంబురాలు మొదలయ్యాయి. ఆ మధ్య చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌తో పాటు రీసెంట్గా ఓ ఫ్యామిలీ పార్టీ కూడా చేసుకుంది. ఈ పార్టీని అల్లు ఫ్యామిలీ హోస్ట్ చేసింది.
ఆరేళ్ల క్రితం వచ్చిన మిస్టర్ సినిమాలో తొలిసారి వరుణ్, లావణ్యలు కలిసి నటించారు. ఈ సినిమాతోనే వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ మరుసటి ఏడాది అంతరిక్షం సినిమాలో మరోసారి వీరిద్దరూ కలిసి నటించారు. ఇక అప్పటి నుంచి వీళ్ల స్నేహం కాస్త ప్రేమగా మారిందని తెలుస్తుంది. కాగా ఎంతో కాలంగా వీరిద్దరూ వాళ్ల ప్రేమను గోప్యంగానే ఉంచుతూ వచ్చారు. వీళ్ల రిలేషన్ పై ఎన్ని వార్తలు వచ్చిన వీరిద్దరూ ఎప్పుడూ వాటిపై స్పందించలేదు.