Varun Tej – Lavanya Tripathi | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి టాలీవుడ్ క్రేజీ జంటలలో ఒకటి. వీరిద్దరు సీక్రెట్‌గా ప్రేమాయణం నడిపి, ఆ తర్వాత పెళ్లి పీటలెక్కారు. నవంబర్ 1, 2023లో వాళ్ళిద్దరి వివాహం జరిగింది. పెళ్లికి కొన్ని రోజుల ముందు వరకు తమ ప్రేమ విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచిన ఈ జంట సడెన్‌గా తమ నిశ్చితార్థం విషయాన్ని ప్రకటించి ఆ తర్వాత పెళ్లి పీటలెక్కారు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మిస్టర్ సినిమాలో తొలిసారి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జంటగా నటించారు అనంతరం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్షం అనే సినిమా చేశారు.
ఈ రెండు సినిమాల షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య బాండింగ్ ఏర్పడి అది ప్రేమ వరకు వెళ్లింది. ఇక వీరిద్దరు కూడా పెద్దలని ఒప్పించి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారు వైవాహిక జీవితంలో ఆనందంగా ఉన్నారు. అయితే ఈ జంట ఓ గుడ్ న్యూస్ అందించబోతున్నారని తెలుస్తుంది. కొద్ది రోజులుగా అక్కినేని నాగ చైతన్య, శోభితా ధూళిపాళ జంట పేరెంట్స్ కాబోతున్నారంటూ ముచ్చటించుకుంటున్నారు. కాని లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే… స్టార్ కపుల్ వరుణ్ తేజ్ అండ్ లావణ్య త్రిపాఠి తండ్రి కాబోతున్నారని లేటెస్ట్ అప్డేట్. ఇది వరకు లావణ్య తన భర్త వరుణ్ తేజ్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ తో దిగిన ఫోటోలు ఎక్కువగా షేర్ చేసేది. కాని ఈ మధ్య కాస్త తగ్గించడంతో లావణ్య ప్రగ్నెన్సీ విషయం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
ఇక లావణ్య త్రిపాఠి సినిమాలు కూడా చాలా తగ్గించింది. ఒకప్పుడు అడపాదడపా సినిమాలు చేసే లావణ్య త్రిపాఠి ఇప్పుడు వెండితెరపై అంతగా కనిపించడం లేదు. ఇది కూడా లావణ్య ప్రగ్నెన్సీ పుకార్లకి ఓ కారణంగా చెప్పవచ్చు. ఇక వరుణ్ తేజ్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే… మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కొరియన్ కనకరాజు’ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత ‘రాధే శ్యామ్’ దర్శకుడు రాధాకృష్ణతో మరో సినిమా చేస్తారని టాక్.గత కొద్ది రోజులుగా సరైన సక్సెస్ అందుకోలేకపోతున్న వరుణ్ తేజ్ ఇప్పుడు మంచి హిట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు.