Gandeevadhari Arjuna Movie | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ బిగెనింగ్ నుంచి విభిన్న కథలు ఎంచుకుంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుణ్ రెండు సినిమాలు సెట్స్‌పైన ఉంచాడు. అందులో ‘గాండీవధారి అర్జున’ ఒకటి. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒక్కటి రాకపోయినా.. పలు మేకింగ్ వీడియోలు సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి. గరుడవేగ లాంటి స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రవీణ్ ఈ సినిమా రూపొందిస్తున్న తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హంగేరిలోని బుడాపెస్ట్‌లో జరుగుతుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్స్ కోసం ప్రీపేర్ అవుతున్నట్లు వరుణ్‌తేజ్ ఇన్‌స్టాలో వెల్లడించాడు. ఈ మేరకు యాక్షన్ కొరిగ్రాఫర్తో ఫైట్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. వీడియో చూస్తే ఈ సినిమాలో యాక్షన్ సీన్లు కొత్తగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. సహా నిర్మాతగా నాగబాబు వ్యవహరిస్తున్నాడు. సాక్షీ వైద్య హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మెయర్ సంగీతం అందిస్తున్నాడు.