Varun Sandesh | హ్యాపిడేస్, కొత్త బంగారులోకం సినిమాలతో స్టార్ హీరోగా మారాడు వరుణ్‌సందేశ్. అయితే ఈ సినిమాలు ఇచ్చిన జోష్‌తో వరుస సినిమాలు చేసి ఫ్లాప్స్ అందుకున్నాడు. ఇక చాలారోజులుగా వరుణ్ సందేశ్‌కు సరైనా హిట్ పడలేదు. ఇక గతేడాది ఇందువదన అంటూ ప్రేక్షకుల ముందుకురాగా ఈ చిత్రం కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే చాలా రోజుల తర్వాత థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు వరుణ్‌సందేశ్. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘నింద’. కాండ్రకోట మిస్టరీ… అనేది ఉపశీర్షిక. రాజేశ్ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా మంచి స్పందన లభించింది. ఇప్పుడు తాజాగా మేకర్స్ టీజర్ విడుదల చేశారు.
జీవితంలో కొన్నిసార్లు తప్పని తెలిసిన చేయక తప్పదు అని తనికెళ్లభరణి డైలాగ్‌తో టీజర్ మొదలవుతుంది. చాలా ప్రశ్నలకు సమాధానం దొరకని క్రైమ్ డ్రామాలా ఈ టీజర్ సాగింది. ఇక కథ చెప్పకుండా చాలా తెలివిగా టీజర్‌ను కట్ చేశారు మేకర్స్. కాండ్రకోట మిస్టరీ వెనక కథేమిటి? నింద ఎవరిపై అన్నది ఈ సినిమాలో కీలకం అని మేకర్స్ తెలిపారు. ఛత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై, శ్రేయారాణి రెడ్డి, క్యూ మధు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సంతు ఓంకార్, ఛాయాగ్రహణం: రమీజ్ నవీత్.