Varun- Lavanya | టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్‌లో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి జంట కోసం. వీరిద్దరు సీక్రెట్‌గా లవ్ ఎఫైర్ నడిపి ఆ తర్వాత ఈ విషయాన్ని పెద్దలకి చెప్పి వారిని ఒప్పించి వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లిని నాగబాబు అట్టహాసంగా జరిపించారు. ఇక పెళ్లి తర్వాత ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇక కొద్ది రోజుల క్రితం లావణ్య, వరుణ్ తాము త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నామనే విషయాన్ని రివీల్ చేశారు. దాంతో మెగా ఇంటికి వారసుడు వస్తాడా, వారసురాలు వస్తుందా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో ఆడవాళ్లకి క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. వెరైటీస్ తినాలని బాగా ఉంటుంది.
అందుకే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన శ్రీమతి లావణ్య త్రిపాఠి కోసం పిజ్జా చేశాడు. ఈ వీడియోని లావణ్య త్రిపాఠి షేర్ చేసింది. ఇక వరుణ్ తేజ్ చేసిన ఆ పిజ్జా అయితే చూస్తేనే యమ్మీ అని అనిపిస్తోంది. కరోనా టైంలోనూ వరుణ్ తేజ్ కుకింగ్ వీడియోలు బాగానే వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తన భార్యకు సేవలు చేసే టైం ఇదే అని వరుణ్ తేజ్ ఇలా టేస్టీ టేస్టీ పిజ్జా చేసినట్టుగా కనిపిస్తోంది. భార్య కోసం వరుణ్ తేజ్ చాలానే కష్టపడుతున్నాడని, ఇంత ప్రేమించే భర్త దొరకడం లావణ్య అదృష్టం అని కొంరదు క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ ఏడాదిలోనే మెగా ఇంట్లో సంబరాలు జరిగేలా ఉన్నాయి.
సినిమాల విషయానికి వస్తే.. లావణ్య త్రిపాఠి పెళ్లి తరువాత చాలా ఆలోచించి, ఆచి తూచి ప్రాజెక్టులు ఎంచుకుంటుంది. పెళ్లి తర్వాత సతీ లీలావతి అనే మూవీని ఒప్పుకోగా, ఈ సినిమాని త్వరగానే పూర్తి చేసింది. ఇప్పుడు డబ్బింగ్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక జూన్‌లో ఈ మూవీని రిలీజ్ చేసేలా ఉన్నారు. కానీ ప్రమోషన్స్‌కి లావణ్య త్రిపాఠి అందుబాటులో ఉండే అవకాశం లేదు. మరోవైపు వరుణ్ తేజ్‌కి అయితే హిట్టు వచ్చి చాలా కాలమే అవుతోంది. ఫిదా, తొలిప్రేమ వంటి సక్సెస్‌లతో దూసుకుపోయిన వరుణ్ తేజ్ ఈ మధ్య సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. అయితే మెగా ఫ్యామిలీలో కొత్త కథల్ని, ప్రయోగాల్ని చేసే హీరోగా వరుణ్ తేజ్‌కు మంచి పేరు అయితే ఉంది. ఇప్పుడు వరుణ్ తేజ్ ఓ తెలుగు, కొరియన్ మూవీని చేస్తుండగా, ఇది కామెడీ, థ్రిల్లర్‌గా అలరించనుందని తెలుస్తుంది.