వరుణ్ ధావన్ హీరోగా నటించిన ‘భేడియా’ సినిమా తెలుగులో ‘తోడేలు’ పేరుతో విడుదలైంది. తోడేలులా ప్రవర్తించే హీరో ఎలాంటి సాహసాలు చేశాడో ఆసక్తికరంగా చూపించారు. పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలనూ చేర్చారు. ఈ సినిమా తాము ఆశించినంత వసూలు చేయలేదని వరుణ్ ఒప్పుకున్నారు. ఆయన మాట్లాడుతూ…‘కథ బాగా నచ్చిన సినిమాలను పారితోషికం తగ్గించుకుని చేస్తుంటాను.
ఒక పెద్ద అటెంప్ట్ చేసినప్పుడు నిర్మాతలు నష్టపోకూడదనే ఆలోచన కూడా నాలో ఉంటుంది. అలా చేసిన చిత్రమే ‘భేడియా’. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించాలని ఒక భారీ ప్రయత్నం చేశాం. అయితే ఆశించినంత వసూళ్లు రాలేదు. అయినా మాతో పాటు రిలీజైన చిత్రాలతో చూస్తే మంచి నెంబర్లనే తీసుకొచ్చింది’ అని చెప్పారు.