వరుణ్‌ధావన్, కీర్తి సురేశ్, వామికా గబ్బి, జాకీ ష్రాఫ్ లీడ్‌రోల్స్ చేస్తున్న చిత్రం ‘బేబీ జాన్’. మురాద్ ఖేతా, ప్రియా అట్లీ, జ్యోతిదేశ్‌పాండే నిర్మాతలు. కలీస్ దర్శకుడు. డిసెంబర్ 25న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. రెండు నిమిషాల నిడివి గల ఈ టీజర్.. చీమల గుంపు ఏనుగును ఎలా ఓడించగలదో ఓ యంగ్ గర్ల్ చెప్పే మెస్మరైజ్ కథనంతో మొదలైంది.
సిన్సియర్ పోలీస్‌గా, ప్రేమగల తండ్రిగా, యాక్షన్ హీరోగా, నైపుణ్యం గల వంటవాడిగా.. ఇలా మల్టీషేడ్స్తో వరుణ్ ధావన్ పాత్ర ఈ టీజర్లో ఆవిష్కృతమైంది. వరుణ్ స్లో మోషన్ స్టంట్స్, దానికి తగ్గ నేపథ్య సంగీతం టీజర్లో హైలైట్స్‌గా నిలిచాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చే సినిమా ఇదని మేకర్స్ చెబుతున్నారు. జియో స్టూడియోస్‌తో కలిసి అగ్ర దర్శకుడు అట్లీ సమర్పిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కిరణ్ కౌశిక్, నిర్మాణం: అట్లీ, ఏ ఫర్ యాపిల్ అండ్ సినీ 1 స్టూడియోస్.