Varudu| పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ తన తదుపరి సినిమా ఎప్పుడు మొదలు పెడతాడా అని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అట్లీతో తన తదుపరి ప్రాజెక్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని బన్నీ అనుకుంటున్నాడు. అయితే బన్నీ కెరీర్లో సూపర్ హిట్స్‌తో పాటు కొన్ని డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. వాటిలో వరుడు చిత్రం ఒకటి. గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా విడుదలకు ముందు భారీ హైప్ క్రియేట్ చేసింది.
యూనివర్సల్ ప్రొడక్షన్ లో డివివి.దానయ్య సినిమాను నిర్మించగా దర్శకుడు గుణశేఖర్ ఖరీదైన సెట్స్ తో సినిమాను చిత్రీకరించాడు. ఆ సినిమా కోసం వందల సంఖ్యలో రియల్ ఫ్యామిలీ మెంబర్స్ ను సెలెక్ట్ చేశారు. ఐదు రోజుల పెళ్లి వేడుక ప్రధానంగా మూవీని తెరకెక్కించగా, ఇందులో హీరోయిన్ ఎవరనేది చివరి వరకు చూపించలేదు . సినిమాలోనే డైరెక్ట్‌గా చూపించాలని అనుకున్నారు. అదే కొంపముంచింది. అల్లు అర్జున్ కూడా సినిమా హిట్ అవుతుందని అనుకున్నాడు. సెకండాఫ్‌లో ఆడియన్స్ సర్ప్రైజ్ అవుతారని భావించారు. అందుకు కారణం హీరోయిన్ని పెళ్లిలో అప్పుడే చూపిస్తారు. అది అల్లు అర్జున్‌కే కాదు, ఆడియెన్స్ కి సర్ప్రైజింగ్గా ఉంటుందని టీమ్ అనుకుంది. అయితే సెకండాఫ్‌లో కథ పెళ్లి వైపు కాకుండా యాక్షన్ వైపు టర్న్ అయింది.
కాబోయే భార్యని విలన్ పెళ్లి పీటల మీద నుండి తీసుకుపోవడం, అల్లు అర్జున్ విలన్ని వెంటాడడం జరుగుతుంది . అయితే ఆడియన్స్ సినిమా అంతా పెళ్లి చుట్టూ ఉంటుందని, పెళ్లి వేడుకని కొత్తగా చూపిస్తారని అనుకోగా, సినిమాలో ఆ సన్నివేశాలు లేవు. దీంతో డిజప్పాయింట్ అయ్యారు.ఇక హీరోయిన్ని సస్పెన్స్‌గా ఉంచడంతో ఆమె ఎంత అందంగా ఉంటుందో అని అనుకున్నారు. తీరా చూస్తే వారి అంచనాలని కూడా అందుకోకపోవడంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. అయితే సినిమా షూటింగ్ మధ్యలోనే దర్శకుడు గుణశేఖర్‌కి అనుమానం వచ్చిందట. చూపిస్తుంది ఒకటి, ఆడియన్స్‌కి రీచ్ అవుతున్నది మరొకటి అని బన్నీతో అనగా, సెకండాఫ్ బాగా వర్కౌట్ అవుతుందని అల్లు అర్జున్ చెప్పారట. దీంతో కథ రివర్స్ అయింది. మూవీ పెద్ద డిజాస్టర్‌గా మిగిలింది