Varsha-Immanuel | సినిమాలలో కొన్ని క్రేజీ జంటలు ఎలా ఉంటాయో, వెండితెరపై కూడా కొన్ని క్రేజీ జంటలు ఉంటాయి. ఆ జంటలకి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. బుల్లితెరపై కూడా కొన్ని క్రేజీ జంటలు ఉన్నాయి. వాటిలో సుధీర్- రష్మీ జంట ఒకటి కాగా, ఇమ్యాన్యుయేల్- వర్ష జంట ఒకటి. సుధీర్- రష్మీ తర్వాత ఇమ్మూ- రష్మీ జంట అందరి దృష్టిని ఆకర్షించారు. చాలామంది వీరి లవ్ ట్రాక్ కోసమే జబర్దస్త్ ను చూశారంటే అతిశయోక్తి కాదు. జనాల అనుమానాలకి తగ్గట్టే ఈ జంటకు రెండు , మూడు సార్లు స్టేజ్ మీదే పెళ్లి చేయించారు. ఆన్ స్క్రీన్ పై వీరి కెమిస్ట్రీని చూసి వీరు నిజ జీవితంలో కూడా లవ్ లో ఉంటారని అంతా అనుకుంటారు. అయితే వర్ష పలు సందర్భాలలో తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని , అంతకు మించి ఏమి లేదని చెప్పుకొచ్చింది.
కొన్ని సందర్భాలలో వారి లవ్ బ్రేకప్ అయిందని, ఒకరంటే ఒకరికి పడడం లేదని ఏవేవో ప్రచారాలు సాగుతూ ఉంటాయి. అయితే జబర్ధస్త్ రేటింగ్ పెంచడానికి వీరు చేస్తున్న ప్రయత్నాలు మాములుగా ఉండవు. తాజాగా ఈ జంట శ్రీదేవి డ్రామా కంపెనీలో రెచ్చిపోయారు. అయితే ఈ సారి స్కిట్ లో కాకుండా రియల్‌గానే ఎమోషనల్ అయినట్టు తెలుస్తుంది. ఇమ్మాన్యుయెల్, జబర్దస్త్ వర్ష కలిసి `తండేల్` మూవీ స్కిట్ చేయగా,వారు ఆ పాత్రల్లో ఇన్వాల్వ్ అయి రక్తికట్టించారు. నిజంగానే బుల్లితెరపై సినిమా చూపించి అందరి ప్రశంసలు అందుకున్నారు.
స్కిట్ పూర్తయ్యాక యాంకర్ రష్మి గౌతమ్.. వర్షని ప్రశ్నించింది. ఇమ్మూతో ఇది నీకు చివరి పర్ఫెర్మెన్స్ అనుకోవచ్చా? అని అడగగా, దీనికి వర్ష స్పందిస్తూ, ఇమ్మూ ఇక్కడ ఎంత మంది ఉన్నా, నువ్వు లేకపోతే బాగోదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. వెంటనే వెళ్లి ఇమ్మాన్యుయెల్‌ని హగ్ చేసుకోవడంతో అతను సైలెంట్ అయిపోయారు. ఇది చూసిన వారందరు నిజంగానే వర్ష.. ఇమ్మాన్యుయేల్‌పై తన ప్రేమని వ్యక్తం చేసిందా ఏంటని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరి మధ్య ఎమోషన్స్ రియల్‌గానే ఉన్నాయని అర్ధమవుతుంది. అయితే ఇది టీఆర్పీ రేటింగ్ స్కిట్టేనా లేదా అనేది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు వేచి చూడాలి.