సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు వివాదాలతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తూ వస్తున్నాడు. సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు ఇలా ఎవరైన సరే వారిపై తనదైన శైలిలో కామెంట్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాడు. ఇటీవల ఓ అమ్మాయితో తెగ రచ్చ చేసిన వర్మ అందులో ఉన్నది తాను కాదని చెబుతూ అందరి దేవుళ్లపై ప్రమాణం చేశాడు. అలానే అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై కూడా ప్రమాణం చేశాడు.
ఇక తాజాగా తన సోషల్ మీడియాలో మెగాస్టార్ బర్త్ డే ఈవెంట్‌పై కామెంట్ చేశాడు.చిరంజీవి బర్త్‌డే వేడుకకి మెగా కుటుంబం అంతా హాజరై సందడి చేశారు. అయితే బన్నీ ఎందుకు మిస్ అయ్యాడా అని అభిమానులు ఆందోళన చెందుతున్న క్రమంలోవర్మ వారిని మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. మెగా ఈవెంట్‌కి హాజరైన వారందరు పరాన్న జీవులని, బన్నీ మాత్రం రియల్ మెగాస్టార్ అంటూ కామెంట్ చేశాడు.
బన్నీ ఎవరి అండదండలు లేకుండా ఈ స్థాయికి చేరుకున్నారని, మిగతా వారు మాత్రం చిరంజీవి సపోర్ట్‌తోనే ఎదిగారు అంటూ పలు కామెంట్స్ చేశారు. గతంలోను వర్మ మెగా ఫ్యామిలీపై పలు సెటైర్స్ వేశాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ అనేక కామెంట్స్ చేయగా, ఆయనని పవన్ ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేశారు. అయిన వర్మ ఏ మాత్రం తగ్గలేదు. వర్మ గత కొన్నాళ్ల కితం అల్లు ఫ్యామిలీ ని టార్గెట్ చేస్తూ ఏదో సినిమా చేస్తా అని సెన్సేషన్ రేపగా, ఇప్పుడు బన్నీకి సపోర్ట్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.