SS Rajamouli | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ గురించి ఒక కీలక అప్డేట్ వెలువడింది. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి చెక్ పెడుతూ రాజమౌళి స్వయంగా క్లారిటీనిచ్చాడు. ఈ సినిమాను తొలుత రెండు భాగాలుగా చేయాలని భావించినప్పటికీ, చివరికి దీనిని ఒకే ఒక్క భాగంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. సుమారు 1300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ అడ్వెంచర్ డ్రామా దాదాపు 3 గంటల 20 నిమిషాల నిడివితో ప్రేక్షకులను అలరించనుంది.
ఈ సినిమాలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనుండగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మందాకినిగా నటిస్తోంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో సుమారు 25 నిమిషాల పాటు సాగే పురాణ గాథల సీక్వెన్స్ హైలైట్గా నిలవనుందని, ఇందులో మహేష్ బాబు రాముడి లుక్లో కనిపిస్తారని సమాచారం. పూర్తిస్థాయి IMAX ఫార్మాట్లో చిత్రీకరిస్తున్న తొలి భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించబోతున్న ఈ విజువల్ వండర్, 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది.
#VARANASI is a one part film. pic.twitter.com/1nHNsrUOG6
— Varanasi (@VaranasiMovie) February 4, 2026