Varanasi | భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కలయికలో రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్ చిత్రం ‘వారణాసి’. ఈ చిత్రం తాజాగా మెక్సికో సిటీలో జరుగుతున్న అతిపెద్ద పాప్ కల్చర్ ఫెస్టివల్ ‘CCXP MX 2026 కామిక్ కాన్‌లో సందడి చేసింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో ప్రదర్శించిన ఫస్ట్ గ్లింప్స్ చూసి అంతర్జాతీయ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ఇక ఈ వేడుకకు రాజమౌళి స్వయంగా హాజరు కాలేకపోయినప్పటికీ, ఆయన పంపిన ప్రత్యేక వీడియో సందేశం ఇప్పుడు ఇంటర్నెట్ను ఊపేస్తోంది. మెక్సికో అభిమానులందరికీ నమస్కారం! ‘వారణాసి’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. అదొక అద్భుతమైన సాహసయాత్ర. భారతీయ పురాణ గాథలను (మైథాలజీ), ప్రపంచస్థాయి యాక్షన్‌తో మేళవించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అని రాజమౌళి పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో మహేశ్ బాబును రాజమౌళి చూపిస్తున్న విధానంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచ ప్రేక్షకులు మునుపెన్నడూ చూడని ఒక కొత్త మహేశ్‌ను ఈ సినిమాలో చూస్తారు అని జక్కన్న భరోసా ఇవ్వడం గమనార్హం. గ్లింప్స్‌లో మహేశ్ బాబు పొడవాటి జుట్టు, రఫ్ గడ్డంతో చాలా కరుకుగా కనిపించారు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో షూట్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ స్థాయిని మించి ఉన్నాయని అక్కడి ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
#VIDEO | El director S. S. Rajamouli envió un video con un mensaje especial para sus fans CCXP México 2026, donde se presentó un primer adelanto de “Varanasi”… #GENTE
🎥 Jacqueline Ponce León pic.twitter.com/kvVPGWKLrX— REFORMA (@Reforma) April 25, 2026